హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా ఆ తపన కొనసాగుతూనే ఉంటుంది. ఇందుకు ఐటీశాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఉదాహరణగా నిలుస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రం కోసం పరితపిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని.. ప్రతిపక్షంలో ఉండి కూడా చేస్తున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రపంచ ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించేందుకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కృత్రిమ మేధస్సులో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా పేరొందిన ఓపెన్ ఏఐని హైదరాబాద్‌కు ఆహ్వానించారు. కేటీఆర్ రాజనీతజ్ఞత, వ్యవహారశైలిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
హైదరాబాద్ ది బెస్ట్… ఎందుకంటే!
ఓపెన్ ఏఐ సంస్థ భారతదేశంలో తొలి కార్యాలయాన్ని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించారు. హైదరాబాద్ అన్ని విధాలుగా అనువైన గమ్యస్థానమని చెప్పారు. సాంకేతిక నిపుణుల లభ్యత, టీహబ్, వీహబ్, టీవర్స్, ఇన్నోవేషన్ సెల్ వంటి వ్యవస్థలు ఉన్నట్టు వివరించారు. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో 2020ని కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించి, పలు కార్యక్రమాలు నిర్వహించినట్టు గుర్తుచేశారు.
హైదరాబాద్ ఐటీలో కేటీఆర్ మార్క్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్.. హైదరాబాద్ ఐటీ బ్రాండ్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. కొత్త ఐటీ, పరిశ్రమల పాలసీలు ప్రవేశపెట్టారు. పరిశ్రమల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా గుర్తింపు తీసుకొచ్చారు. 2014లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు 57,258 కోట్లు ఉండగా 2023-24లో రూ. 2.70 లక్షల కోట్లకు పెరిగింది. పదేండ్లలో ఏకంగా రూ. 2.13 లక్షల కోట్లు పెరిగాయి. ఐటీ దిగ్గజ కంపెనీలను రప్పించడం, ఎగుమతులు పెరగడంలో కేటీఆర్ తన మార్క్ చూపించారు.
నెటిజన్ల స్పందన.. అభినందన