KTR | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): బహ్రెయిన్ జైల్లో చికుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏండ్ల మానువాడ నర్సయ్యను స్వదేశం రప్పించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారత విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన విదేశాంగశాఖ మంత్రి ఎస్ జయశంకర్‌కు ఒక లేఖ రాశారు.
పాస్‌పోర్ట్ సమస్యల కారణంగా నర్సయ్య బహ్రెయిన్ జైల్లో ఉన్నారని తెలిపారు. బతుకుదెరువు కోసం నర్సయ్య 1996లో బహ్రెయిన్ వెళ్లారు. అకడి ‘ది అరబ్ ఇంజినీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ’లో మూడేండ్లపాటు తాపీ మేస్త్రీగా పనిచేశారు. 1999 ఆగస్ట్‌లో వర్ పర్మిట్ ముగిసినా నర్సయ్య అక్కడే పనిచేస్తూ ఉన్నాడు.
పాస్‌పోర్ట్ గడువు కూడా 2001లో ముగియటంతో బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ రెన్యువల్ చేసింది. ఆ గడువు కూడా ముగిసిందని, అయితే నర్సయ్య తనవద్దనున్న పాస్‌పోర్ట్ పొగొట్టుకున్నాడు. వర్ పర్మిట్, పాస్‌పోర్ట్ లేకపోవటంతో అక్రమంగా తమ దేశంలో ఉంటున్నాడంటూ బహ్రెయిన్ పోలీసులు నర్సయ్యను అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. నర్సయ్య విషయమై అతని భార్య లక్ష్మి, కూతుళ్లు సోన, అపర్ణ, కుమారుడు బాబు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. నర్సయ్యకు తాతాలిక పాస్‌పోర్ట్‌ను ఇచ్చే విషయంలో చొరవ చూపాలని విదేశాంగ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
నర్సయ్యను స్వదేశం రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి పాస్‌పోర్ట్ జారీ అయ్యేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. నర్సయ్యను విడుదల చేసి భారత్‌కు పంపించాలంటే ఆయన భారతీయుడని తెలిపే ఆధారాలను బహ్రెయిన్ ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
నర్సయ్య గుర్తింపును ధృవీకరించాలని బహ్రెయిన్ ప్రభుత్వ సంస్థ లేబర్ మారెట్ రెగ్యులేటరీ అథారిటీ 2024 జనవరి 8న అక్కడి భారత రాయబారికి లేఖ రాసిందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తాతాలిక పాస్‌పోర్ట్ జారీచేస్తే బహ్రెయిన్ ప్రభుత్వం నర్సయ్యను డిపోర్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు.
బహ్రెయిన్‌లోని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయం చేసుకొని నర్సయ్య విడుదలకు సహకరించాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి పాత రికార్డులను పరిశీలించి నర్సయ్య చిరునామా కనుకొని సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల ద్వారా నివేదిక ఇవ్వాల్సి ఉందని, ఈ విషయంలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేలా ప్రయత్నం చేస్తానని కేటీఆర్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగంతోపాటు రాష్ట్ర ఎన్నారై వ్యవహారాలశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ప్రక్రియను మరింత వేగంగా అయ్యేలా తన కార్యాలయ సిబ్బందికి కేటీఆర్ ఆదేశించారు.