హైదరాబాద్, జనవరి 31(నమస్తే తెలంగాణ): పరువునష్టం నోటీసులు పం పాల్సింది తనకు కాదని, వాటిని మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపాలని కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్‌కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. తనపై పరువున ష్టం దావా వేస్తానన్న మాణిక్కం వ్యా ఖ్యలపై ఎక్స్ ద్వారా కేటీఆర్ స్పందించారు. మాణిక్కం ఠాకూర్‌కు రేవంత్‌రెడ్డి రూ.50 లక్షల లంచం ఇచ్చి పీసీసీ పదవిని కొనుక్కున్నారంటూ అప్పట్లో కోమటిరెడ్డి ఆరోపించారని, ఈ విష యం మీడియాలోనూ వచ్చిందని గుర్తు చేశారు. అదే విషయాన్నే తాను ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో కోమటిరెడ్డి తన ఆరోపణలను వెనక్కి తీసుకోలేదని, వివరణ కూడా ఇవ్వలేదని, కాబట్టి ఆ నోటీసులను తనకు కాకుండా సచివాలయంలో కూ ర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపాలని కేటీఆర్ సూచించారు.