తనది పక్క రాష్ట్రమైనా తెలంగాణలో మంత్రిగా కేటీఆర్ చేస్తున్న పనులకు అతడు ఫిదా అయ్యాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ నడిపిస్తున్న తీరుకు ముగ్ధుడయ్యాడు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలని ఆకాంక్షించాడు. ఇందుకోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర ప్రారంభించాడు ఆంధ్రాకు చెందిన శేఖర్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా రాజం మండలానికి చెందిన శేఖర్ మంత్రి కేటీఆర్‌కు అభిమాని. కేటీఆర్ పేరును తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. మంత్రి కేటీఆర్ సీఎం కావాలని విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్టాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకుపోతున్న విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని శేఖర్ అంటున్నాడు. తెలంగాణను అభివృద్ధిలో పరుగులుపెట్టిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలన్నాడు. కేటీఆర్ సీఎం కావాలనే సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నానని చెప్పాడు.