కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ
న్యాయవాదులుగా ప్రమాణ స్వీకారం చేసి వృత్తి జీవితంలోకి అడుగుపెట్టిన తొలిరోజే పలువురు యువ న్యాయవాదులు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తెలంగాణభవన్‌లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఆశీర్వదించిన బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- బాధితులు, సామాన్యులకు న్యాయం కోసం వృత్తి నిబద్ధతతో పనిచేయాలని పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : న్యాయవాదులుగా ప్రమాణ స్వీకారం చేసి వృత్తి జీవితంలోకి అడుగుపెట్టిన తొలిరోజే పలువురు యువ న్యాయవాదులు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తెలంగాణభవన్‌లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అంబేదర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన కుర్ర ధరణి, దగాని తరుణ్ తేజ, సాలైగారి నిఖిల్, ఉన్నమట్ల ప్రియాంక, సుల్తాన్, సరస్వతి తదితరులు కేటీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
వారితో ఆప్యాయంగా మాట్లాడిన కేటీఆర్.. వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. బాధితులు, సామాన్యులకు న్యాయం అందించేందుకు నిబద్ధతతో పనిచేయాలని, న్యాయవాద రంగంలో ఉత్తమ ప్రతిభ చూపాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియపై కేటీఆర్ వారికి కీలక సూచనలు చేశారు. తమకు విలువైన సమయాన్ని కేటాయించి దిశానిర్దేశం చేసిన కేటీఆర్‌కు యువ న్యాయవాదులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

