KTR Birthday | కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న కేటీఆర్.. ఆశీర్వదించిన కేసీఆర్ దంపతులు
KTR Birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వదించారు. తన పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు.
KTR Birthday | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వదించారు. తన పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను, శోభమ్మను తన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘నూరేళ్లు వర్థిల్లూ’ అంటూ కేటీఆర్‌ను కేసీఆర్ దీవించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో రక్తదానం…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీఆర్ఎస్వీ నాయకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. అంతకు ముందు భారీ కేక్‌ను మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, లింగయ్య యాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాకేశ్ కుమార్, రామ్మూర్తి యాదవ్, రాజీవ్ సాగర్, పల్లె రవి కుమార్, రూప్ సింగ్, అంజనేయ గౌడ్, బీఆర్ఎస్వీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరిగాయి.
సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్యతో కూడి తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తల్లి శోభమ్మ గార్లకు పాద నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదాలను కేటీఆర్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా..… pic.twitter.com/QtHucn6e3S
— BRS Party (@BRSparty) July 24, 2024
ఇవి కూడా చదవండి..
Gift a Smile | కేటీఆర్ బర్త్‌డే.. 100 మంది విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు అందజేత
Telangana Assembly | అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడగింపు
DEECET Results | డీఈఈ సెట్ ఫలితాలు విడుదల.. 12,032 మంది ఉత్తీర్ణత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

