అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
సుప్రియ కుటుంబానికి కేటీఆర్ భరోసా.. భౌతికకాయాన్ని త్వరలో స్వదేశానికి తెప్పించేందుకు సహకరిస్తామని హామీ.
మహబూబాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుప్రియ మృతి చెందగా.. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అమెరికాలోని సెయింట్‌లూయిస్‌లో రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం శ్రీనివాస్-జ్యోతి కూతురు సుప్రియ మరణించారు. ఖమ్మంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులను మంగళవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.
అనంతరం ఆమె కేటీఆర్‌కు ఫోన్ చేయగా.. ఆయన సుప్రియ తల్లిదండ్రులతో మాట్లాడి పరామర్శించారు. అధైర్య పడొద్దు.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుప్రియ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు తమవంతు సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. బాధిత కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌కు సూచించారు. సత్యవతి రాథోడ్ మహబూబాబాద్‌లోని సుప్రియ మామ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించి సుప్రియ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

