హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కూకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్‌బీ) భూముల వేలంలో గజం భూమి రూ.2.70లక్షల ధర పలికింది. కేపీహెచ్‌బీ ఏడవ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన వేలంలో గజం ధర రూ.1.60లక్షలుగా నిర్ధారించగా.. రూ.2.70లక్షలు పలికినట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎండీ వీపీ గౌతం తెలిపారు. మరో ప్లాట్ గజానికి రూ.2.36లక్షలు ధర పలికిందన్నారు. బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.47.14కోట్ల మేర ఆదాయం సమకూరినట్టు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తేతెలంగాణ): ఎైక్సెజ్ శాఖలో పెద్దసంఖ్యలో ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆ శాఖ కమిషనర్ సీ హరికిరణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేసారి 562 మందిని బదిలీ చేశారు. వీరిలో 17 మంది అసిస్టెంట్ ఎైక్సెజ్ సూపరింటెండెంట్, 250 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 295 మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరిలో పలువురికి ప్రమోషన్లు కల్పించారు.