చర్లపల్లి-తిరుపతి మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లు
పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 07025 ప్రత్యేక రైలు ఈనెల 4న చర్లపల్లి నుంచి తిరుచానూరుకు, 07026 ప్రత్యేక రైలు 5న తిరుచానూరు నుంచి చర్లపల్లికి నడుస్తాయని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 07025 ప్రత్యేక రైలు ఈనెల 4న చర్లపల్లి నుంచి తిరుచానూరుకు, 07026 ప్రత్యేక రైలు 5న తిరుచానూరు నుంచి చర్లపల్లికి నడుస్తాయని పేర్కొన్నారు. అలాగే 9న హైదరాబాద్-మంగళూరుల మధ్య 07097, 10న మంగళూరు-హైదరాబాద్ మధ్య 07098 నంబర్ గల ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపారు.
హైటెక్ సిటీలో 4 ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాప్ పొడిగింపు
హైదరాబాద్,సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గతంలో ఇచ్చిన తాతాలిక స్టాప్‌ను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వీటిలో నరసాపురం-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ (17255), లింగంపల్లి-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (17256), కాకినాడ టౌన్-లింగంపల్లి కోకనాడ ఎక్స్‌ప్రెస్ (12775), లింగంపల్లి-కాకినాడటౌన్ కోకనాడ ఎక్స్‌ప్రెస్ (12776) రైళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు.
దీంతో నరసాపురం-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ హైటెక్ సిటీ రైల్వేస్టేషన్లో ప్రతిరోజూ ఉదయం 4.45కు ఆగనున్నదని తెలిపారు. లింగంపల్లి-నరసాపురం ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి 9.08 గంటలకు, కాకినాడ-లింగంపల్లి కోకనాడ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.10గంటలకు ఆగుతుందని వెల్లడించారు. ఈ మూడు రైళ్లు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకు హైటెక్ సిటీ స్టేషన్లో ప్రతి రోజూ స్టాప్ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే లింగంపల్లి-కాకినాడ టౌన్ కోకనాడ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ రాత్రి 7.08కు ఆగుతుందని తెలిపారు. ఈ రైలు డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకు స్టాప్ ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | వయసుతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వస్తాయా? పోషకాహార నిపుణుల కీలక హెచ్చరిక..
తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఆంధ్రాకు లీక్?.. 15 మంది అధికారులను తొలగించిన సీఎం విజయ్
AP News | ఏపీలో 58 ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు పెండింగ్..!
AP News | బొత్స ఇలాకాలో వైసీపీకి ఘోర పరాజయం.. కేవలం ఒక్క ఎంపీపీ స్థానమే దక్కిన వైనం..!
Rajinikanth | మనవడితో రజినీకాంత్ స్టైలిష్ వాక్ అదిరిందంతే
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

