SCR | దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ (జీ)గా ఐఆర్ఎస్ అధికారి కోట్ల ఉదయనాథ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2012 ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ బ్యాచ్ అధికారి కోట్ల ఉదయనాథ్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్. కోట్ల ఉదయ్‌నాథ్ ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
రైల్వే శాఖలో ఆర్థిక నిర్వహణ, అకౌంటెన్సీలో కోట్ల ఉదయనాథ్ అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. ఇంతకు ముందు ఆయన సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలోని కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్‌లో డిప్యూటీ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఛీఫ్ అకౌంట్స్ అధికారిగా పనిచేశారు. గత పదేండ్ల సర్వీస్‌లో దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ & హైదరాబాద్ డివిజన్లలో డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్‌గా, నాందేడ్ డివిజన్ లో సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ తదితర ముఖ్య పదవులను నిర్వహించారు.
Mahindra Scorpio- N | మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో కొత్త ఫీచర్లు.. అవేమిటంటే..?!
Moto G85 5G | 10న భారత్ మార్కెట్లోకి మోటో జీ85 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
CMF Phone 1 | 50-ఎంపీ కెమెరా.. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో సీఎంఎఫ్ ఫోన్1 ఆవిష్కరణ..!