కోరుట్ల, ఫిబ్రవరి 17: డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్ష ఫలితాల్లో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మౌనిక స్టేట్ టాపర్‌గా నిలిచారు. బెజ్జారపు మాధవి-వేణుగోపాల్ దంపతుల కూతురు మౌనిక.. టీఎస్పీఎస్సీ శుక్రవారం ఫలితాలు ప్రకటించగా, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 18 డ్రగ్ఇన్స్పెక్టర్ పోస్టులకు 2023 మే 19న పరీక్షలు నిర్వహించారు. మొత్తం 450 మార్కులకు గాను మౌనిక 348 మార్కులు సాధించారు. అస్సాంలో ఎంఫార్మసీ చదివి గోల్డ్ మెడల్ సాధించారామె. 2019లో పంచాయతీ సెక్రటరీగా పని చేసి, ప్రస్తుతం హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్లో ఫార్మసిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.