గోదావరిఖని, నవంబర్ 18 : తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులు అన్యాయం వైపు నిలుస్తున్నారని అన్నారు. రామగుండంలో నలుగురు మహిళా కార్పొరేటర్లపై పోలీసు ఉన్నతాధికారి అసభ్య పదజాలంతో మాట్లాడటం దారుణమని అన్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో డిప్యూటీ మేయర్‌పై పెట్రోల్ పోసిన వ్యక్తిపై పోలీసులు కేసునమోదు చేయలేదని, ఫిర్యాదు చేసిన వారిపై ఇప్పటికి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని తిలక్‌నగర్, లక్ష్మీనగర్, చౌరస్తాలో నిరుపేదల కట్టడాల అక్రమంగా కూల్చివేశారని అన్నారు. వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా వారి జీవితాలను రోడ్డుపై పడేశారని మండిపడ్డారు. సింగరేణి, మున్సిపల్ అధికారులు ఈ కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ అనే ఒకే ఒక్క కారణంతో సిరి ఫంక్షన్‌హాల్‌ను కూల్చివేశారని ధ్వజమెత్తారు. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నా కుట్రపూరితంగా కూల్చివేశారని మండిపడ్డారు.
మానవ దేహం అనేక రకాల యంత్రాలతో కూడిన కర్మాగారం లాంటిది. ఎంతో సంక్లిష్టమైన మన దేహంలో వివిధ రకాల భాగాలు, ఎముకలు, గ్రంథులు ఉంటాయి. వాటిలో కొన్నింటి వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదని వైద్యులు తరచుగా చెప్తుంటారు. అలాంటి వాటిలో మన చాతీ ఎముకకు వెనుకవైపున ఉండే చిన్నపాటి కొవ్వు గ్రంథి ఒకటి. బాల్యదశలో మన రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఎంతో కీలకపాత్ర పోషించే ఈ గ్రంథిని ‘థైమస్’ అంటారు. కానీ, యుక్తవయసు దాటాక దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్న భావనతో కొందరు రోగులు వైద్యులను సంప్రదించి శస్త్రచికిత్స ద్వారా ఆ గ్రంథిని తొలగించుకుంటారు.