Konda Murali | కొండా సుస్మిత తనకు నచ్చినట్లు ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అవినీతిపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. మా బిడ్డ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అని కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి అన్నారు. బుధవారం ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మా బిడ్డకు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది. ఆమె చిన్నపిల్ల కాదు.
ఆమె మనోభావాలు ఆమెకు ఉంటాయన్నారు. క్రమశిక్షణ కమిటీకి చెప్పాల్సింది చెప్పాను. మంత్రి కొండా సురేఖ అందుబాటులో లేదు అనడం అవాస్తమన్నారు. మాకు గాంధీ కుటుంబంపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నేను కాంగ్రెస్‌లోనే కొనపాగుతానని స్పష్టం చేశారు. అలాగే సుస్మిత వ్యాఖ్యలపై భట్టీతో చర్చించలేదు. ఓ బిల్లు విషయంలో డిప్యూటీ సీఎంను కలిశానని ఆయన పేర్కొన్నారు.