Komatireddy | నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ నిర్ణయం ప్రకారం ఎవరైనా సీఎం కావచ్చని చెప్పారు.
ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేని కిరణ్‌కుమార్‌రెడ్డి గతంలో సీఎం కాలేదా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పదవి రెండూ సమానమేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చినా తాను ముఖ్యమంత్రి పదవి అడుగనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యేల మద్దతు ఉంటే వాళ్లే సీఎం కావచ్చని, ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్యమేనని చెప్పుకొచ్చారు.