హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ తలపడనున్నది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం స్థానానికి తమ అభ్యర్థిగా డాక్టర్ కొలిపాక వెంకటస్వామిని ప్రకటించింది. అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన్ను తమ అభ్యర్థిగా ఖరారు చేసినట్టు సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ సోమవారం వెల్లడించారు.