నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులకు శుభవార్త అని తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలోని నిరుద్యోగులంతా ప్రభుత్వం కల్పించిన ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దామోదర్ పిలుపునిచ్చారు. పోటీ పరీక్షలకు శ్రద్ధగా చదివి, ఉద్యోగాలు సాధించాలని తెలంగాణ యువతకు సూచించారు. భారీ నోటిఫికేషన్ జారీచేసినందుకుగానూ సీఎం కేసీఆర్‌కు దామోదర్ కృతజ్ఞతలు తెలిపారు.