హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారని తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులకు శుభవార్త అని వెల్లడించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.