హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): సహకార రంగంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విజ్ఞప్తి చేశారు. సహకార సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
హాస్పిటల్ పనులు త్వరగా పూర్తిచేయాలి ; రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
వరంగల్ చౌరస్తా, మే 26 : మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్అండ్బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్‌తో కలిసి హాస్పిటల్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హాస్పిటల్ దేశానికే ఐకానిక్ కాబోతున్నదని చెప్పారు. అదనపు మౌలిక వసతులు, వైద్యసేవల వివరాలపై నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. అనంతరం భవన నిర్మాణాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.