వరంగల్ : కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో పీజీ మెడిసిన్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి రెండవ విడత వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుండి 6వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సీట్ల ఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని తెలిపారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ https://www.knruhs.telangana.gov.in/ ను పరిశీలించొచ్చని యూనివర్సిటీ అధికార వర్గాలు తెలియజేశాయి.