ఆర్మూర్‌టౌన్, జనవరి 21: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామసభకు ఆయన హాజరయ్యారు. గ్రామంలో పది ఇండ్లు కట్టిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందంటూ మహిళలు ప్రశ్నించారు.
గెలిచి ఏడాదైనా ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. ఇలా గ్రామస్థుల నిలదీతతో ఏమి మాట్లాకుండానే ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి గ్రామసభ నుంచి వెళ్లిపోయారు.