‘ఓ పిల్లా.. బాత్రూంల నల్లాలు ఇప్పి అస్తున్నవ్..
నీళ్లు అట్టిగ పాయిఖాన్ల కల్శిపోతున్నయ్
నువ్వుజెయ్యవట్టి ఒక ఆడకట్టుకయ్యే నీళ్లు
గంగల కలుత్తన్నయ్’ అని మనుమరాలు మీదికి కయ్యన లేసింది బాపమ్మ
ఓ ముసల్దానా.. ఎందుకొర్తున్నవే
ఫుల్లుగ నీళ్లు ఉండె.. రోజు నల్లా ధారెత్తి పొయ్యనేవట్టే
నీకేమైతుందే.. నీదేమన్న పోతున్నదా?
(మనుమరాలి గదమాయింపు)
ఆఁ.. నువ్వు మా కాలంల పుడితే
ఆ నీళ్ల ఇలువ తెల్సేది నీకు
ఆ కాంగిరేసోల్ల కాలంల
షెంబట్క పోనుగూడ
షెంబెడు నీళ్లు లేకుండె..
గప్పుడు గీ పాయిఖాన్లు ఏడియి?
అవి కట్టిత్తే పజలకు రోగాలు రావన్న
సోయి గూడా లేకుండె గీ కాంగ్రెసోళ్లకు..!
పొద్దుగాల లేత్తె షెంబు పట్కోని
పొలాల పొన్న పోవుడె..
వానకాలం తప్ప ఏ కాలంలజూసినా
గా పొలాలల్ల నీళ్లు లేకపోవు..
ఇంటికేలి షెంబుల పట్క పోదామంటే
అప్పుడప్పుడు గంగాలంల
సుక్క నీరుండకపోయేది
నీళ్లు లేక ఒక్కోపారి
అచ్చేదిగూడ ఆపుకున్న రోజులున్నయ్
గసోంటి గోసలు చూశినం
నీళ్లు లేక గొడగొడ ఏడ్సినం..
గిప్పుడు కేసీఆర్ కాలు పుణ్యం
చేతి గుణం వల్ల ఏడజూసినా నీళ్లే
ఎండకాలంల గూడా చెర్లు, కాల్వలు,
వాగులు, ఒర్రెల నిండా నీళ్లే కన్పిత్తన్నయ్
ఎర్రటెండల్ల నీళ్లు మత్తడి దుంకుతున్నయ్
అట్లనీ గిప్పుడు మనం కేసీఆర్
కట్టపడి తెచ్చిన నీళ్లను కరాబ్జేస్తే
రేపు నీకు పుట్టబోయే పిలగాండ్లు
ఆల్లకు పుట్టేటి పిలగాండ్లకు
నీళ్లు దొర్కకుంటైతయ్
గప్పటికి గీసోంటి లీడర్ మనకుండాలి
అందుకే కేసీఆర్ను,
ఆయన కట్టపడి తెచ్చిన నీళ్లను
మనం కాపాడుకోవాలె!
– రాజు అతికం 9440012834