జగిత్యాల : రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) శనిలా పట్టుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి( Jeevan Reddy ) ఆరోపించారు. బుధవారం జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ( KCR ) కుటుంబం, బీఆర్ఎస్ నాయకులపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ గడిచిన మూడు సంవత్సరాల్లో మూడు రూపాయల అవినీతిని రుజువు చేయలేక పోయారని విమర్శించారు. కేసీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు.
రేవంత్ రెడ్డికి పాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.ఎల్‌నినో ప్రభావంతో సాగు నీరు, విద్యుత్ కొరతతో పంటలు తడి ఆరిపోయి ఇబ్బందులు ఎదుర్కొం టుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎతిపోసి ఉంటే ఉత్తర తెలంగాణకు సాగు నీరు అందే అవకాశం ఉండేదని వెల్లడించారు. కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని కుట్ర పూరితంగా నీటిని ఎత్తిపోయలేదని అన్నారు.
రైతు బిడ్డగా కేసీఆర్ సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించారని స్పష్టం చేశారు.2014 నుంచి 7,700 మెగావాట్ల విద్యుత్ నుంచి 19,000 వేల మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి పెంచారని అన్నారు. హైదరాబాద్ ఫోర్త్ సిటీలో అమరవీరుల కుటుంబాలకు కాలనీ నిర్మించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వేల కోట్ల అక్రమ ఆస్తుల వివరాలు మన్నె క్రిషాంక్ బయట పెట్టినా రేవంత్ రెడ్డి నుంచి సమాధానం లేదని పేర్కొన్నారు. కింద పంటలు కాపాడడానికి వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేయాలనిచ
కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని, రెండో పంటకు నీరు అందించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అయిల్నేని వెంకటేశ్వర రావు, వోళ్ళం మల్లేశం, అల్లాల ఆనంద్ రావు, శీలం ప్రవీణ్ కుమార్, కళ్లేపల్లి దుర్గయ్య, అల్లాల రమేష్ రావు, గాజుల రాజేందర్, రాగుల ప్రదీప్, ధర రమేష్ బాబు, జున్ను రాజేందర్, శీలం సురేందర్, రూపా రఘు, స్వామి రెడ్డి, పులి రాము, మల్లారెడ్డి,హరీష్, మామిడిపల్లి మహిపాల్, రాజి రెడ్డి, సున్నిత్ రావు పాల్గొన్నారు.