హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): మన ఆరోగ్యం బాగుండాలంటే, రోగాలు రాకుండా ఉండాలంటే ఏం కావాలో తెలుసా? ఇంటాబయట స్వచ్ఛమైన గాలి, స్థిరమైన వాతావరణం, స్వచ్ఛమైన, సరిపడా నీళ్లు, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, రసాయనాలను సురక్షితంగా వినియోగించటం, రేడియేషన్ నుంచి రక్షించుకోవటం, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, పనిప్రదేశాలు శుభ్రంగా ఉండటం, ఆరోగ్యాన్ని సంరక్షించేలా సిటీల నిర్మాణం, పోషకాహారం, సమతుల్య పర్యావరణం ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది.
ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వాతావరణంలో పైన పేర్కొన్న అంశాల్లో ఏ ఒక్కటీ సరైన స్థాయిలో లేవు. ధ్వంసమైన పర్యావరణం, విపరీతమైన వాతావరణ మార్పులతో మన జీవితాలు నిత్యం ప్రభావితం అవుతున్నాయి. ఇవి మనకు శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో పర్యావరణ మార్పులతో సంబంధం ఉన్నవి ఎంతో తెలుసా? 24 శాతం. అంటే మరణిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు పర్యావరణ మార్పుల బాధితులే.
పర్యావరణ మార్పులతో అంటువ్యాధులు, అసాంక్రమిక వ్యాధులతో పాటు రోడ్డు ప్రమాదాలు, హింస వంటివి కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు, ప్రజ ల వ్యక్తిగత ‘ఆరోగ్య’ బడ్జెట్ రెండు, మూడు రెట్లు పెరిగిపోయింది. ఉదాహరణకు.. కలుషితమైన గాలిని పీల్చితే శ్వాసకోశ, గుండె సం బంధ సమస్యలు తలెత్తుతాయి. అతిగా వర్షా లు నమోదైనప్పుడు, వరదలు వచ్చినప్పుడు డయేరియా, మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులు విజృంభిస్తాయి.
కరువు సమయంలో కలుషిత నీటి వల్ల రోగాలబారిన పడ టం, తగినన్ని నీళ్లు దొరక్క డీ హైడ్రేషన్ వంటి పరిస్థితులు ఎదురవుతాయి. రెండు సందర్భాల్లోనూ సరైన ఆహారం దొరక్క పోషకాహార లోపం ఏర్పడుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి తగ్గి, శరీరం బలహీనపడి ఇతర వ్యాధులు సోకుతాయి. రక్తపోటు, మధుమే హం, గుండె జబ్బులు, చర్మసంబంధ సమస్య లు, క్యాన్స ర్లు.. ఇలా అనేక వ్యాధులు చుట్టుముడుతాయి. ఫలితంగా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జేబులు ఖాళీ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వాలు ప్రజారోగ్యం కోసం భారీగా నిధులు కేటాయించాల్సి వస్తుంది.
ప్రకృతి ధ్వంసం.. మనకు శాపం డబ్లూహెచ్వో తాజా నివేదిక ప్రకారం..
పర్యావరణాన్ని పునరుద్ధరిస్తే..
పర్యావరణ మార్పులను నిలువరించి, పునరుద్ధరించగలిగితే వ్యాధులు తగ్గుముఖం పడుతాయని.. ఆరోగ్యకర జీవితాన్ని గడుపవచ్చని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. ఈ నివేదిక ప్రకారం పర్యావరణాన్ని పునరుద్ధరిస్తే..