KCR | సెప్టెంబర్ 07 వ తేదీ నుంచి రాష్ట్ర శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్ననేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 06 న ఎర్రవల్లి నివాసంలో మధ్యాహ్నం 1 గంటకు లంచ్ అనంతరం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన సంయుక్త సమావేశం జరగనున్నది.
ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.