సారే సీఎం కావాలని.. అభిమానుల పాదయాత్ర.. దేవుండ్లకు మొక్కులు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అభిమానం వెల్లువెత్తుతున్నది. ఆయన తిరిగి సీఎం కావాలనే ఆకాంక్ష రోజురోజుకూ అందరిలోనూ బలపడుతున్నది. మొన్న వినాయకచవితి..నిన్న బతుకమ్మ, దసరా సంబురాల్లో పాటల రూపంలో కేసీఆర్‌పై యువత అభిమానం చాటుకున్నది.
- తాజాగా కోయిలకొండవాసి..
- ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న రాంచందర్
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అభిమానం వెల్లువెత్తుతున్నది. ఆయన తిరిగి సీఎం కావాలనే ఆకాంక్ష రోజురోజుకూ అందరిలోనూ బలపడుతున్నది. మొన్న వినాయకచవితి..నిన్న బతుకమ్మ, దసరా సంబురాల్లో పాటల రూపంలో కేసీఆర్‌పై యువత అభిమానం చాటుకున్నది. మరికొందరు యువకులు పాదయాత్ర చేస్తూ..దేవుండ్లకు మొక్కుకుంటూ వారి ఆకాంక్షను వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టాలని సంకల్పించి మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం అంకెల్ల గ్రామానికి చెందిన కావలి రాంచందర్ ఇటీవల పాదయాత్ర చేపట్టి ఆదివారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు.
సుదూర ప్రాంతం నుంచి కాలినడకన వచ్చిన రాంచందర్ ప్రత్యక్షంగా కేసీఆర్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తన కోసం ఎంతో శ్రమకోర్చి పాదయాత్రగా వచ్చిన రాంచందర్‌ను కేసీఆర్ ఆప్యాయంగా పలుకరించి యోగక్షేమాలు, ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అభిమాని చూపించిన ఆత్మీయత, పార్టీపై ఉన్న అంకితభావాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా అభినందిస్తూ అతడికి శుభాశీస్సులు అందజేశారు. కేసీఆర్‌ను కలుసుకున్న అనంతరం రాంచందర్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని, ఆయన మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ తాను ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు.
ఎర్రవల్లిలో అభిమానుల సందడి
ఇటీవలి కాలంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద అభిమానుల సందడి గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సామాన్యులు, రైతులు, యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్‌ను కలుసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, రైతుబంధు, ఉచిత విద్యుత్తు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలను గుర్తుచేసుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
కాలినడన యువకులు
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని మొకుకుని కొద్దిరోజుల క్రితం పెద్దపల్లి జిల్లా మంథని నుంచి టెన్నీపాల్, బూర్ల వెంకటేశ్, కొండా వెంకటేశ్ ఎర్రవల్లి వరకు పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇలా కేసీఆర్ కోసం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలు, బైక్ ర్యాలీల ద్వారా తరలిరావడం గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది. వచ్చిన ప్రతి అభిమానినీ, కార్యకర్తనూ ఓపికగా కలుస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్న కేసీఆర్, వారికి భరోసా ఇస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

