ధ్రువీకరణ పత్రాలు అందుకున్న ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి
ఎమ్మెల్సీలు | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నుంచి శుక్రవారం కల్వకుంట్ల కవిత ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నుంచి శుక్రవారం కల్వకుంట్ల కవిత ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, బి గోపి ధ్రువీకరణ పత్రం అందజేశారు. శ్రీనివాస్ రెడ్డికిమంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు పసునూరి దయాకర్, కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టి రాజయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి, రెడ్యానాయక్, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, జగదీశ్వర్, డిసిసిబి చైర్మన్ రవీందర్రావు, టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ ముఖ్య నేతలు తదితరులు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.
కాగా, ఆదిలాబాద్ జిల్లాలో 1, నల్లగొండ 1, మెదక్ 1, ఖమ్మం 1, కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు డిసెంబర్ 10న జరగనున్నాయి. ఆదిలాబాద్ నుంచి దండె విఠల్, నల్లగొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఖమ్మం నుంచి తాతా మధు, మెదక్ నుంచి డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, కరీంనగర్ నుంచి భానుప్రసాద్ రావు, ఎల్ రమణ బరిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వివాహితతో ఎస్ఐ రాసలీలలు..రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
భూ వివాదంతో దళిత కుటుంబం హత్య.. బాలికపై సామూహిక లైంగికదాడి
40 రోజుల పసికందును చంపిన అత్యాచార బాధితురాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

