Karate Kalyani | హైదరాబాద్ బీజేపీ ఎంపీ టికెట్‌ను మాధవీలతకు కేటాయించడంతో అసహనంలో ఉన్నారనే వార్తలపై కరాటే కల్యాణి స్పందించారు. హైదరాబాద్ ఎంపీ టికెట్‌ను మాధవీలతకు కేటాయించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. తాను తెలంగాణ నుంచి టికెట్ ఆశించలేదని స్పష్టం చేశారు. బీజేపీ తరఫున ఏపీ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వివరించారు.
అయితే, బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో లుకలుకలు ఉన్నాయని ఈ సందర్భంగా కరాటే కల్యాణి ఆరోపించారు. కష్టపడినవారికి టికెట్లు ఇవ్వకుండా.. షో చేస్తున్న వారికి టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు.