నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు పరీక్షలు
Kanti velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు నిర్వహించనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 18 ఏండ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు. నేటి నుంచి వంద రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 16,556 చోట్ల అధికారులు శిబిరాలను ఏర్పాటు చేశారు. శని, ఆదివారాలు, సెలవు రోజులు మినహా అన్నిరోజుల్లో కంటి పరీక్షలు చేస్తారు.
ఇంటింటికి వెళ్లి కంటివెలుగు స్లిప్పులను ఏఎన్ఎంలు పంపిణీ చేయనున్నారు. వ్యక్తి వివరాలు, టెస్టుకు వెళ్లాల్సిన ప్రాంతం, సమయాలను అందులో పొందుపరుస్తారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 120 మందికి పరీక్షలు చేయనున్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు పంపిణీ చేయనున్నారు. ఇక ఎవరికైనా కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తే… ఆ వివరాల్ని ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఆ వివరాల్ని తీసుకొని కంప్యూటర్లో నమోదు చేయించే ఉన్నతాధికారులు.. ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేస్తారు. ఎప్పుడు, ఎక్కడ ఆపరేషన్ ఉండేదీ లబ్దిదారులకు ఒకట్రెండు రోజుల్లో చెబుతారు. ఆ ప్రకారం లబ్దిదారులు ఆయా ఆస్పత్రికి వెళ్లి.. ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించుకోవచ్చని అధికారులు తెలిపారు.

ప్రతి ఒక్కరి వివరాలు భద్రంగా
కంటి పరీక్షలకు వచ్చేవారు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలి. అక్కడ సిబ్బంది వారి పేరు, ఫోన్ నంబర్, ఆధార్, చిరునామాలాంటి సమగ్ర వివరాలను సేకరిస్తారు. శిబిరంలో మొత్తం ఆరు దశల్లో పరీక్ష జరుగుతుంది. ప్రక్రియ మొత్తం ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహిస్తారు. బాధితుల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉంటాయి. ఈ డేటా ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ప్రజల కంటి ఆరోగ్యంపై పర్యవేక్షణకు అవకాశం కలుగుతుంది.

ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ నేరుగా ఏఎన్ఎంకు
శిబిరంలో దృష్టిలోపాలు గుర్తించినవారికి అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు అందజేస్తారు. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరం ఉన్నవారికి కాస్త ఆలస్యంగా అందుతాయి. వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ను ఆన్లైన్లో అద్దాల తయారీ కంపెనీకి పంపుతారు. లబ్ధిదారుడి పేరు, చిరునామా, ఏ ప్రాంతంలో శిబిరం నిర్వహించారు? ఏ సబ్ సెంటర్/ ఏ ఏఎన్ఎం పరిధిలోకి వస్తుంది? లాంటి వివరాల ఆధారంగా ప్రిస్కిప్షన్ గ్లాసెస్ నేరుగా సంబంధిత ఏఎన్ఎంకు చేరుతాయి. అనంతరం వారు లబ్ధిదారుడికి అందజేస్తారు.
సకల వసతులతో 16,533 క్యాంపులు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,763 గ్రామాలు, పట్టణాల్లోని 3,788 ప్రాంతాల్లో (వార్డులు) కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. మొత్తంగా 16,533 ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. శిబిరం ప్రారంభం అయ్యేముందు ఆ ప్రాంతంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. ప్రతి ఇంటికీ ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు. మరోవైపు కంటి పరీక్షల కోసం ప్రభుత్వం ఇప్పటికే 1500 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- aadhar card
- ANM
- asha workers
- camps
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

