KNRUHS | కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోట ఏంబీబీఎస్ సీట్లకు ఈ నెల 23 , 24వ తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం మాప్అప్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీట్ల ఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపరుచనున్నారు.
శనివారం సాయింత్రం 5 గంటల నుంచి 24న సాయింత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్కు అర్హులు. గత విడత కౌన్సెలింగ్లో సీట్ అలాటై జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా అదే, విధంగా ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీట్ పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్కు అనర్హులని స్పష్టం చేసింది. వివరాల కోసం knruhs.telangana.gov.in వెబ్సైట్ సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.