Kaloji Kalakshetram | కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించొద్దు : అంపశయ్య నవీన్
Kaloji Kalakshetram | కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించొద్దు అని అంపశయ్య నవీన్ అన్నారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 18 : పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం హనుమకొండలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రంలో ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించరాదని, కాళోజీ ఫౌండేషన్‌కు రెండు గదులు, ఒక చిన్న సమావేశ మందిరాన్ని కేటాయించాలని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళోజీ కళాక్షేత్రంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతోపాటు, గ్రంథాలయం, పఠనశాల (రీడింగ్ రూమ్) ఏర్పాటు చేసుకోవడానికి కాళోజీ ఫౌండేషన్‌కు సుమారు 200 మంది కూర్చునే ఒక హాలు, రెండు గదులు కేటాయిస్తామని చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంకు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవ సమయంలో రాతపూర్వకంగా కాళోజీ ఫౌండేషన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదన్నారు.
ప్రస్తుతం కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేయడం సరైంది కాదన్నారు. కాళోజీ ఫౌండేషన్‌తోపాటు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం కాళోజీ ఆశయాలకు అనుగుణంగా సాహిత్య, కళా, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడమని, అలాంటి ప్రత్యేక ప్రయోజనం కోసం నిర్మించిన కళాక్షేత్రాన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు వినియోగించడం సముచితం కాదన్నారు.
ఈ భవనం సాహిత్య, కళా, సాంస్కృతిక కార్యకలాపాలకు మాత్రమే ప్రధాన వేదికగా కొనసాగాలని, ప్రభుత్వంలోని ఇతర సంస్థలకు కార్యాలయాల అవసరం ఉంటే వాటికి ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రీ, ఉపాధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్, కార్యదర్శి వీఆర్ విద్యార్థి, సంయుక్త కార్యదర్శులు పొట్లపల్లి శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఆగపాటి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రాణాలు పోతున్నా సహారా బాధితులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
Reading Vs Listening | వినడం లేదా చదవడం.. రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది..?
Library | గ్రంథాలయంలో నూతన ఆడిటోరియం, రీడింగ్ హాల్ ప్రారంభం
Komatireddy Rajagopal Reddy | పండబెట్టి తొక్కుతవా.. రేవంత్ రెడ్డి ? రాజగోపాల్ రెడ్డి ఏమైనా అంత ఈజీగా కనిపిస్తున్నడా..?
Health tips | పొట్టకింది కొవ్వుతో ఇబ్బందిగా ఉందా.. అయితే ఆ కొవ్వును తగ్గించే సింపుల్ టిప్స్ మీ కోసం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

