Kakatiiya University | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 17: బీసీ బంద్ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన ఎల్ఎల్బీ, బీటెక్, ఎమ్మెస్సీ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ (బయోటెక్నాలజీ అండ్ కెమిస్ట్రీ), ఎంటెక్, సి.ఎల్ .ఐ .ఎస్ .సి (దూరవిద్య) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ ప్రకటనలో తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని, మిగతా అన్ని పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ www.kakatiya.ac.in ను సందర్శించాలని సూచించారు.