హైకోర్టు సీజేగా తపబ్రత చక్రవర్తి
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తపబ్రత చక్రవర్తిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
- నాలుగు హైకోర్టుల్లో సీజేల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తపబ్రత చక్రవర్తిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 26న ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ పీ శ్యాంకోశీని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదించింది.
గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనష్ రంజన్పాఠక్ను అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్సింగ్ను ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసినట్టు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. రాష్ట్రపతి ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

