హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు విద్యను తక్షణం కోర్టులో హాజరుపర్చాలనే శాంతిచర్చల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ బీ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ హఫీజ్పేట్ నుంచి సాయుధ పోలీసులు ఆమెను తీసుకెళ్లారని, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. విద్యను కోర్టులో హాజరుపర్చాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను కోర్టుకు సరెండర్ చేయాల న్నారు. శాంతిచర్చలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు.