Junior Doctors Strike | జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె.. సర్కారు దవాఖానల్లో నిలిచిన వైద్య సేవలు
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె (Junior Doctors Strike) చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె (Junior Doctors Strike) చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు తగ్గేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దాదాపు 4 వేల మంది సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. స్టయిఫండ్ చెల్లింపులతోపాటు 8 డిమాండ్లు పరిష్కరించాలని ఈ నెల 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామన్నారు. గత నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ వైద్యశాఖ మంత్రి కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోలేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిరవధిక సమ్మెకు దిగామన్నారు.
గత నెల 20న కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. 21న ఉన్నతాధికారులు చర్చలు జరిపి హామీ ఇవ్వటంతో సమ్మె విరమించారు. నెల గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవటంతో ఈ నెల 19న మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు. మరుసటి రోజు నుంచి తమ నిరసనను వివిధ రూపాల్లో తెలియజేశారు. నల్ల రిబ్బన్లు, డ్రెస్ వేసుకొని విధులకు హాజరుకావటం వంటివి చేపట్టారు. ఆదివారం కండ్లకు నల్లగంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పట్టించుకోలేదు. దీంతో తాము నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు.

జూనియర్ డాక్టర్ల డిమాండ్లు ఇవే..
- ప్రతి నెల 10వ తేదీలోగా స్టైపెండ్ జమచేసేలా గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలి.
- సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెండ్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలి.
- పదేండ్లు పూర్తయిన నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యార్థులకే దక్కేలా ఉత్తర్వులు ఇవ్వాలి.
- ప్రభుత్వ దవాఖానల్లో భద్రతపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. పోలీసులతో భద్రత కల్పించాలి.
- హాస్టల్ భవనాలను నిర్మించకపోవటంతో పీజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలి.
- ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలి.
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలి.
- కాకతీయ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో అంతర్గత రోడ్లు వేయాలి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

