Junior College | రాష్ట్రంలో అన్ని జూనియర్ కాలేజీలకు రేపటితో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఎల్లుండి (జూన్ 1వ తేదీ ) నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. శనివారం నాడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలు తెరుచుకోనున్నాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ వసుంధరా దేవి తెలిపారు.
ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 204-25 విద్యా సంవత్సరంలో అకడమిక్ క్యాలెండర్ను తప్పకుండా జూనియర్ కాలేజీ యాజమాన్యాలను ఆదేశించారు.