హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : ప్రైవేటు మెడికల్ కాలేజీల విద్యార్థుల స్టెఫండ్ కోసం చేస్తున్న ఆందోళనకు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (టీ-జూడా) మద్దతు తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జే ఇసాక్ న్యూటన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ైస్టెఫండ్ అంశంపై ప్రైవేట్ మెడికల్ కాలేజీలు శనివారం భేటీ కానున్నాయని పేర్కొన్నారు.
మెడికోల ైస్టెఫండ్ డిమాండ్‌కు మద్దతుగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నల్ల బ్యాండ్లను ధరించాలని పిలుపునిచ్చారు. వైద్యులమంతా ఒకటే అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రైవేటు కాలేజీలు మెడికల్ విద్యార్థులకు పారదర్శకంగా ైస్టెఫండ్ అందించాలని డిమాండ్ చేశారు.