వనపర్తి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరారు. తాజాగా జిల్లాలోని ఖిల్లా ఘణపురం మండలం షాపూర్ గ్రామానికి చెందిన పలువురు మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలాంజనేయులు గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు సామల ఆంజనేయులు, ఎండీ అబ్దుల్, కె.సోమ్లా నాయక్, తిరువాటి కృష్ణయ్య, గంటల శ్రీనివాసులు, రాంచంద్రయ్య, కొండలు, బాలయ్య తదితరులు ఉన్నారు.