హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పూర్తిచేసిన వారికి హెటిరో ఫార్మా సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో 300కు పైగా ఉద్యోగాలు భర్తీచేయనున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే నియామక షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు సర్కార్‌ను వదిలిపెట్టబోమని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య హెచ్చరించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఫీజు బకాయిలపై లడాయి పేరుతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొని మాట్లాడారు. 10-12వేల కోట్ల బకాయిలున్నాయని.. 4లక్షల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.