హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): నూతన విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ సహా వృత్తివిద్యా కాలేజీలకు గుర్తింపు జారీ ప్రక్రియను జేఎన్టీయూ వేగవంతం చేసింది. కాలేజీలు ఈ నెల 20లోపు జేఎన్టీయూ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఏఐసీటీఈ అఫిలియేషన్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా, జేఎన్టీయూ సైతం ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఈ సారి బీఈఏ, బీసీఏ, బీఎంఎస్ వంటి కోర్సులను నిర్వహిస్తున్న కాలేజీలు సైతం ఆఫిలియేషన్కు దరఖాస్తు చేసుకోవాలని జేఎన్టీయూ అధికారులు సూచించారు.