Jishnudev Varma | తెలంగాణ గవర్నర్గా ప్రమాణ చేసిన జిష్ణుదేవ్ వర్మ..
Jishnudev Varma | తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
Jishnudev Varma | తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, పుష్పగచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పలువురు కిషన్రెడ్డి సహా మంత్రులు గవర్నర్కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఇదిలా ఉండగా.. గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసిన జిష్ణుదేవ్ వర్మ 2018 నుంచి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేశారు. గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వారు కాగా.. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 1990లో బీజేపీలో చేరారు. ఆయన అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు గవర్నర్ పదవిని కట్టబెట్టింది.
Read Also :
-
Telangana Assembly | ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం.. శాసనసభ రేపటికి వాయిదా
-
BRS MLAs | సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే.. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్
-
TG Rains | తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

