టూరిస్ట్ యాష్కీ.. ఒళ్లు జాగ్రత్త

- అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా తెలంగాణ
- ఇసుక ఆదాయం ఏడేండ్లలో 4,335 కోట్లు
- కేసీఆర్ కుటుంబాన్ని ఏమన్నా ప్రజలు ఊరుకోరు
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దక్కేది సింగిల్ డిజిట్టే
- మధుయాష్కీపై మండిపడ్డ టీఆర్ఎస్ఎల్పీ
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత మధుయాష్కీ రాష్ర్టానికి ఓ టూరిస్ట్ అని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా తెలియడం లేదని టీఆర్ఎస్ఎల్పీ దుయ్యబట్టింది. అభివృద్ధిని తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు అడ్డంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. నిజామాబాద్ ఎంపీగా పదేండ్లు ఉన్నా ఏమీచేయలేని దద్దమ్మ మధుయాష్కీ అని మండిపడింది. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, పురాణం సతీశ్, గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో పదేండ్లలో ప్రభుత్వానికి ఇసుక మీద కేవలం రూ.36 కోట్లు ఆదాయం వస్తే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ తెచ్చిన ఇసుక పాలసీతో ఏడేండ్లలోనే రూ.4,335 కోట్ల ఆదాయం వచ్చిందని పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి తెలిపారు. అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఇష్టారీతిగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఆయనకు సబ్జెక్ట్ తక్కువ.. సౌండ్ ఎక్కువ అని ఎద్దేవాచేశారు. లాబీయింగ్ స్పెషలిస్ట్ మధుయాష్కీ ఎమ్మెల్సీ కవితపై ఆడబిడ్డ అనే సోయిలేకుండా వ్యాఖ్యలు చేయడంతో మహిళల పట్ల ఆయన నిజస్వరూపమేమిటో తెలియజేస్తున్నదని చెప్పారు. ఎన్నికల నుంచి పారిపోయి, బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తి మధుయాష్కీ అని ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ విమర్శించారు.రాష్ర్టాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా దళితబంధు ఆగదు
‘కంచు మోగునట్టు కనకమ్ము మోగునా’ అన్నట్టు కాంగ్రెస్ నేతలు మొరుగుతున్నారని.. సీఎం కేసీఆర్ మాత్రం రాష్ర్టాన్ని కనకమయం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తెలిపారు. మధుయాష్కీ, బీజేపీ నేత బండి సంజయ్ వారిస్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభ్యతలేని నాయకులను ప్రజలు ఎక్కడిక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కమీషన్ల కోసం బీ-ఫాంలు అమ్ముకున్న మధుయాష్కీ నీతి, నిజాయితీ గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు కోర్టుల్లో ఎన్నికేసులు వేసినా సీఎం కేసీఆర్ ప్రాజెక్టును పూర్తిచేశారని.. రేపు దళితబంధును ఆపాలని చూసినా తలపెట్టిన కార్యాన్ని పూర్తిచేసి తీరుతారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టంచేశారు. దళితబంధుపై, దళితులపై ఈటల బావమరిది చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

