హనుమకొండ చౌరస్తా, జూన్ 9: దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ(అడ్వాన్స్డ్)-2024లో ప్రవేశానికి ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజయాలను సాధించి జాతీయస్థాయిలో ఎస్సార్ విజయపథాన్ని మరోసారి ఎగురవేశారని ఎస్సార్ విద్యాసంస్థల ఛైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు.
జేఈఈ(అడ్వాన్డ్స్) 2024 ప్రవేశపరీక్షలో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో అన్ని కేటగిరీలు కలిపి జి.నవీన్ 8వ ర్యాంకు, పి.రాకేష్‌కుమార్ 36వ ర్యాంకు, జే.శ్రీనిత్సందేశ్ 123వ ర్యాంకు, వి.రాంబాబు 125వ ర్యాంకు సాధించి ఎస్సార్ కీర్తి ప్రతిష్ఠను జాతీయస్థాయిలో నిలబెట్టారన్నారు. ఇంకా వి.వేదవచన్రెడ్డి 127, జే.శ్రీతన్రెడ్డి 133, బోడ దినేష్ 157, మాలోత్ వెంకటేశ్వర్లు 185, దాసరి కార్తీక్ 299, తిలావత్ అఖిల్నాయక్ 323, కె.శ్రీరాంరెడ్డి 324 ర్యాంకు సాధించినట్లు, వీటితో పాటు ఓపెన్, అన్ని కేటగిరీలు కలిపి జాతీయస్థాయిలో వరసగా 450, 598, 621, 654, 689, 737, 751, 901, 966 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.
జేఈఈ(అడ్వాన్స్)లో విద్యార్థులు సాధించిన ఈ విజయాలకు సంతోషాన్ని తెలియజేస్తూ ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి భవిష్యత్‌లో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 50 సంవత్సరాల్లో పటిష్టమైన ప్రణాళికలతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీలలో విద్యనందిస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయస్తాయి పోటీ పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్న విద్యార్థులు ఈ సంవత్సరం ఐపీఈ, జేఈఈ(మెయిన్), టీఎస్ఎంసెట్, నీట్లో కూడా విశిష్టమైన మార్కులు, ర్యాంకులు సాధించారని, ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. ఎస్సార్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన వారు దేశ, విదేశాల్లో వేల మంది ఉన్నతమైన పదవుల్లో ఉన్నారని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.