హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): మహిళా డ్యాన్సర్‌పై లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌ను ఎట్టకేలకు పో లీసులు గోవాలో అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన పోలీసులు జానీపై పోక్సో, లైంగికదాడి కేసులు నమోదు చేసిన విషయం తెల్సిందే.
పరారీలో ఉన్న జానీమాస్టర్ గోవాలో ఉన్నట్టు పోలీ సులు గుర్తించారు. గురువారం జానీమాస్టర్‌ను అరెస్టు చేసి, గోవా కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం ఉప్పర్‌పల్లిలోని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపర్చనున్నట్టు డీసీపీ తెలిపారు.