హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): జనసేన పార్టీకి బలమున్న స్థానాల్లోనే అభ్యర్థులను పెడతామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యా ణ్ ప్రకటించారు. విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులుంటాయని, ఢిల్లీ టూ ర్లో ఇదే అంశంపై చర్చలు జరిగాయని తెలిపారు. వైఎస్సార్సీపీ దాష్టీకాన్ని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. సీఎం పదవి కోసం తాను వెంపర్లాడనని, కష్టానికి పదవులే కలిసి వస్తాయని చెప్పారు. గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశామని, కనీసం 30 సీట్లు వచ్చి ఉంటే ఈసారి సీఎం రేసులో ఉండేవాళ్లమని అభిప్రాయపడ్డారు. జూన్ నుంచి తాను క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో పర్యటిస్తానని వెల్లడించారు. లెఫ్ట్ పార్టీలు తమతో పొత్తులకు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రైతులను క్రిమినల్స్‌లా చూస్తున్నదని ఆరోపించారు.