నానక్‌రామ్ గూడ : హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో ఈగల్ టీమ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఏపీ బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి గంజాయి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతడికి పోలీసులు డ్రగ్స్ టెస్టు నిర్వహించగా పాజిటివ్‌గా వచ్చింది. దాంతో నార్సింగి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.
కాగా సుధీర్‌రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ వినియోగంపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. సుధీర్‌రెడ్డికి గంజాయి ఎవరి ద్వారా వచ్చింది అనేకోణంలో విచారణ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.