జడ్చర్ల, జూలై 10 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సోదరుడు దుశ్యంత్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని రాజాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎస్పీని ఆశ్రయించిన ఘటన సొంత పార్టీలోనే కలకలం రేపుతున్నది. మహబూబ్‌నగర్ ఎస్పీకి గురువారం ఫిర్యాదు చేయగా, ఈ విషయాన్ని పోలీస్ అధికారులు గోప్యంగా ఉంచారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సోదరుడు దుశ్యంత్‌రెడ్డి ఓ భూమి వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడి సదరు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రాజాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తెర కృష్ణయ్య ఆరోపించారు. న్యాయం కోసం ఇంటికి వెళ్లే తన అనుచరులతో భయభ్రాంతులకు గురిచేయడంతో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. సొంత పార్టీ మండల అధ్యక్షుడిపైనే దౌర్జన్యానికి పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.