హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (టీజీఎస్ఈసీ) షెడ్యూల్ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సందర్భంగా ప్రజలకు వచ్చే సందేహాల నివృత్తి కోసం కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించిన సమాచారం, అనుమానాల నివృత్తి కోసం 9240021456కు ఫోన్ చేయాలని శనివారం ఒక ప్రకటనలో సూచించింది.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించడానికి, రిజిస్టర్ చేయడానికి, స్పందించడానికి హైదరాబాద్లోని ఎన్నికల కమిషన్ కార్యాలయం కేంద్రంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నది.