హైదరాబాద్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని ప్రముఖ బిర్యానీ హోటళ్లు పిస్తాహౌస్, షా గౌస్, మెహిఫిల్లో రెండోరోజూ ఐటీ విభాగం సోదాలు జరిపింది. 20 ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు లావాదేవీల రికార్డులు, లెడ్జర్లు, డిజిటల్ ఖాతాలపై సిబ్బందిని ప్రశ్నించారు. హైదరాబాద్లోని వివిధ ఔట్లెట్లు, కార్పొరేట్ ఆఫీసులు, మేనేజ్మెంట్ నివాసాలు లక్ష్యంగా 30మంది ఐటీ అధికారులు, పారామిలిటరీ బలగాల సాయంతో సోదాలు చేపట్టారు. పిస్తాహౌస్ ఫౌండర్ మొహమ్మద్ అబ్దుల్ మజీద్ నివాసం(రాజేంద్రనగర్), మెహిఫిల్, షాగౌస్ డైరెక్టర్ల నివాసాలు(టోలిచౌకీ, షాలీ బండా)లో కూడా తనిఖీలు చేశారు. వీరు కొన్నేండ్లుగా పన్ను ఎగవేస్తున్నారని తేల్చారు. దేశీయంగానేకాక దుబాయ్ లోనూ బ్రాంచీలను నిర్వహిస్తూ ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్నారు.