హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఐసెట్-2024 పరీక్ష ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ నరసింహాచారి ప్రకటించారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలు విడుదల చేయనున్నారు.