ఏవో ప్రమోషన్లలో గోల్మాల్!.. వైద్యారోగ్య శాఖలో మరో అవినీతి
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. డీహెచ్ పరిధిలో చేపట్టిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) ప్రమోషన్లలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మల్టీ జోన్-1, మల్టీ జోన్-2 పరిధిలో 92 మందికి ఏవోలుగా ప్రమోషన్లలో కల్పించారు.
- లంచాలతో అనర్హులకు అందలం
- ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు.. మొత్తం రూ.1.84 కోట్లు వసూలు
- విభాగాధిపతి పీఏ ద్వారా అవినీతి పర్వం
- చక్రం తిప్పిన డీహెచ్, అడిషనల్ డైరెక్టర్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. డీహెచ్ పరిధిలో చేపట్టిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) ప్రమోషన్లలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మల్టీ జోన్-1, మల్టీ జోన్-2 పరిధిలో 92 మందికి ఏవోలుగా ప్రమోషన్లలో కల్పించారు. ఈ ప్రక్రియలో అనర్హులకు ప్రమోషన్లు కల్పించి పెద్ద మొత్తం డబ్బులు కొల్లగొట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. హడావిడిగా డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేయించి, తాము కోరుకున్నవారితో ప్రమోషన్ల జాబితా సిద్ధం చేశారని, ఉద్యోగోన్నతులు కల్పించిన 92 మంది నుంచి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.1.84 కోట్లు కొల్లగొట్టారని తెలిసింది. ఈ వ్యవహారమంతా డీహెచ్, అడిషనల్ డైరెక్టర్ కనుసన్నల్లో జరిగి
నట్టు సమాచారం. వసూళ్ల పర్వాన్ని డీహెచ్ పీఏ ముందుండి నడిపారని, వసూలు చేసిన మొత్తాన్ని వాటాలు వేసి పంచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇతర ఉద్యోగులు మండిపడుతున్నారు. వైద్యారోగ్య శాఖలో ఏవోలుగా ఉద్యోగోన్నతులు వస్తాయని ఎన్నో ఏండ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తుంటే ముడుపులు చెల్లించిన వారికే ప్రమోషన్లు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు
ఈ అవినీతి బాగోతంపై కొందరు ఉద్యోగులు లేఖ ద్వారా వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వరంగల్, హైదరాబాద్ పరిధిలో కొంతమంది పేర్ల ను డీపీసీ అప్రూవల్ కమిటీలో చేర్చేందుకు రూ.50 లక్షలు వసూలు చేశారని, ఒక్కో జోన్ పరిధిలో రూ.25 లక్షల వసూళ్లకు పాల్పడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వసూళ్ల వ్యవహారాన్ని డీహెచ్ పీఏ ముందుం డి నడిపారని, ఆ వసూళ్ల ద్వారా వచ్చిన సొ మ్మును డీహెచ్, అడిషనల్ డైరెక్టర్ వాటాలు వేసుకుని పంచుకున్నారని, గతంలో నర్సింగ్ ఉద్యోగోన్నతుల్లోనూ ఇదేవిధంగా అవినీతి జరిగిందని ఉద్యోగులు ఆరోపించారు. ఈ ప్రమోషన్ల ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని, అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్రమాలకు చాన్సే లేదు
ఏవో ప్రమోషన్లను పారదర్శకంగా చేప ట్టాం. అభ్యర్థుల సందేహాలను ఐఏఎస్ ఆఫీసర్లు, హెచ్వోడీలతో కూడిన కమిటీలో నివృత్తి చేశాకే ఈ ప్రక్రియను పూర్తి చేశాం. మొత్తం ప్రక్రియను ప్రభుత్వం కూడా పరిశీలించింది. అయినప్పటికీ ఉద్యోగోన్నతుల కోసం కొంత మంది కోర్టుకు వెళ్లారు. ఏవో ప్రమోషన్లలో అక్రమాలకు అవకాశమే లేదు. సీనియారిటీ లిస్టు తయారయ్యాక ఆ జాబితాను డిస్ప్లే చేశాం.
– డీహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

